← Back to news

సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన గుజరాత్‌ స్టార్ బౌలర్!

By sahani· 22 Apr 2026· X· Gujarath

గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ కగిసో రబాడ వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2026 ఆడుతున్న అతను, ఒక హోటల్ దగ్గర స్మోకింగ్ చేస్తూ కెమెరాకు దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. గతంలో రబాడపై డోపింగ్ ఆరోపణలు ఉండటంతో, అతను వాడింది కేవలం సిగరెట్టేనా లేక ఏదైనా నిషేధిత పదార్థమా అని BCCI అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రబాడ 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.

More in Sports