ఎల్నినో ఎఫెక్ట్.. నీటి పొదుపుపై రైతులకు అవగాహన

ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఉద్యాన పంటల సాగులో రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వి. మధుసూదన్ సూచించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తెట్టేలపాడులో సాగవుతున్న మిరప, టమాటా పంటలను ఆయన పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పంటలకు అవసరమైన మేరకే నీరు, ఎరువులు వాడాలని, సరైన యాజమాన్య పద్ధతులతో నీటి వృథాను అరికట్టి మెరుగైన దిగుబడులు సాధించాలని తెలిపారు.




