ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. అదుపులో ప్రయాణికుడు

TG: హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్‌లో ఓ ప్యాసింజర్ లగేజీలో లైవ్ బుల్లెట్ గుర్తించారు. అబుదాబి వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్‌ను స్క్రీనింగ్ చేస్తుండగా బుల్లెట్ బయటపడింది. వెంటనే ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ అతడిని ఫ్లైట్ నుంచి దింపి శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. బుల్లెట్ అతడి వద్దకు ఎలా వచ్చింది? దానికి సరైన అనుమతి ఉందా? అనే అంశాలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.