← Back to news

వర్షం లేక.. మిర్చి, పత్తి కళ్లు తేలేస్తున్నాయ్!

By siva· 4d ago
వర్షం లేక.. మిర్చి, పత్తి కళ్లు తేలేస్తున్నాయ్!

పల్నాడు దాచేపల్లి రైతులకు వర్షమే పెద్ద టెన్షన్‌గా మారింది. మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. బోర్ల నీళ్లు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో పంటలకు నీరందించడం కష్టంగా మారింది. ఇలాగే కొనసాగితే పంట నాణ్యత దెబ్బతింటుంది. మార్కెట్లో ధర కూడా రాదు. ఇది రైతులకు రెట్టింపు నష్టం! ఎపి మొత్తం ఇదే పరిస్థితి. ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో 52% వర్షపాతం లోటు నమోదైంది. దేశవ్యాప్తంగా కూడా 13% లోటే. ఐఎండీ అంచనా ప్రకారం సెప్టెంబర్లోనూ వర్షాలు తగ్గే అవకాశమే ఉంది. మీ ఊళ్లో వర్షాలు, పంటల పరస్థితి ఎలా ఉంది? కామెంట్ చేయండి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.