అనంతపురంలో భూ వివాదం కలకలం
అనంతపురం రూరల్ మండలం నారాయణపురంలో ఇంటి స్థలం వివాదం ఘర్షణకు దారితీసింది. ఐదు సెంట్ల స్థలం విషయంలో బోయ సాయిపై శ్రీహరి తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు సమాచారం. సుమారు 20 మంది కట్టెలతో దాడి చేయడంతో సాయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



