Jio యూజర్లకు Canva ప్రీమియం ఫ్రీ.. ఎలాగంటే?

కాన్వాతో రిలయన్స్ జియో పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకుంది. దీంతో అర్హులైన జియో యూజర్లు ఏడాది పాటు కాన్వా ప్రో లేదా ప్రో లైట్‌ను ఫ్రీగా వాడుకోవచ్చు. ఈ ఆఫర్ ఈరోజు (సెప్టెంబర్ 16) నుంచి అందుబాటులోకి వచ్చింది. 349, 399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు 349 రూపాయల కంటే ఎక్కువ విలువైన 2GB హైస్పీడ్ డేటా ప్లాన్లకు ప్రో లైట్ ఉచితం. మైజియో యాప్‌లో ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. కాన్వా ప్రోకు 100GB, ప్రో లైట్‌కు 50GB క్లౌడ్ స్టోరేజ్ కూడా వస్తుంది.



