కారు ఢీకొని.. అలుగునూరు వాసి మృతి!

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తా వద్ద విషాదం. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. అలుగునూరుకు చెందిన వీర్ల సదా లింగం (40)ను ఢీకొట్టింది. చౌరస్తా వద్ద ఆయన నిలబడి ఉండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



