← Back to news

డ్రైన్ పనులకు బ్రేక్.. స్థానికుల ఆందోళన

By Ashvath· 6h ago· Medchal Malkajgiri
డ్రైన్ పనులకు బ్రేక్.. స్థానికుల ఆందోళన

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో బాక్స్ డ్రైన్ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. సాయినగర్ కమాన్ నుంచి శివసాయినగర్ నాలా వరకు ₹.5.50 కోట్లతో చేపట్టిన పనులు ఏడాదిన్నరగా నత్తనడకన సాగి, రెండు నెలలుగా నిలిచిపోయాయని కాలనీ కమిటీల సమాఖ్య (CCS) తెలిపింది. దీంతో కుషాయిగూడ, చర్లపల్లి డివిజన్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు కుచించుకుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

More in Local