← Back to news

కల్వకుర్తిలో బిజెపి నాయకుల అరెస్ట్

By శ్రీనివాస్ నాగర్ కర్నూల్· 2h ago· Kalwakurthy (Ct), Kalwakurthy, Nagarkurnool
కల్వకుర్తిలో బిజెపి నాయకుల అరెస్ట్

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ, BJYM నాయకులను నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. మొగిలి దుర్గాప్రసాద్, బోడ నర్సింహ, నరేష్ చారి, బాబీ దేవ్, పరశురాములు తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

More in Local