రైతుల ఖాతాల్లోకి రాయితీ డబ్బులు: మంత్రి తుమ్మల

TG: రైతుల సాగు కష్టాలను తగ్గించడంతో పాటు వ్యవసాయ ఖర్చులు తగ్గించేందుకు యాంత్రీకరణకు పెద్దపీట వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలపై నిర్వహించిన సమీక్షలో మంత్రి పలు నిర్ణయాలు తీసుకున్నారు. యాంత్రీకరణ పథకం కింద నాణ్యమైన వ్యవసాయ పరికరాలను తక్కువ ధరలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, రాయితీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు తగినంతగా అందుబాటులో ఉన్నాయన్నారు.



