గాజాలో దారుణం.. రెండు సంచుల పిండి కోసం అమ్మాయి పెళ్లి

గాజాలో మహిళలు, అమ్మాయిలు తమను తాము అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అత్యాచారం చేసిన వారినే పెళ్లి చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని UN రిపోర్ట్ చెప్పింది. యుద్ధం వల్ల గాజాలో ఆకలి, పేదరికం పెరిగాయి. దీంతో 12-17 ఏళ్ల వయసున్న పిల్లలకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇలాంటి పెళ్లులు 123 శాతం పెరిగాయి. ఒక తండ్రి తన 14 ఏళ్ల కూతురిని రెండు సంచుల పిండికోసం పెళ్లి చేయడం ఈ దారుణాలకు అద్దం పడుతోంది.



