← Back to news

5 నుంచి ఉచిత AI ఫౌండేషన్ ప్రోగ్రాం

By A.Ajay· 3 Oct 2026
5 నుంచి ఉచిత AI ఫౌండేషన్ ప్రోగ్రాం

AIని రోజువారీ పనుల్లో సమర్థంగా ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ‘పాటమ్’ నాలుగు వారాల ఉచిత AI ఫౌండేషన్ ప్రోగ్రాం నిర్వహించనుంది. AI ఉద్యోగాలకు ప్రత్యామ్నాయం కాదని, ఆయా రంగాల్లో పనిచేసేవారి సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని AI డిజిటల్ స్కిల్ ట్రైనర్ అర్జున్ తెలిపారు. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో ఒక్క బ్యాచ్‌కు 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం 9505401290 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

More in Infotainment