వర్షాల తగ్గుదలకు ప్రభుత్వాన్ని నిందించొద్దు: వేముల వీరేశం
తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. 1951 నుంచి దేశంలో 16 సార్లు ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇది ప్రభుత్వ తప్పు కాదని అన్నారు. రైతులకు ధైర్యం చెప్పాల్సిన ప్రతిపక్ష నేతలు వర్షాల కొరతకు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని విమర్శించారు. KCR హయాంలో కరోనా వచ్చినప్పుడు తాము ఆ తప్పును ఆయనకు ఆపాదించలేదని, ఇప్పుడు KTR కూడా అదే విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.


