← Back to news

దాడికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: SFI

By NRPT· 1d ago· Chinna Hyderabad, Zahirabad, Sangareddy
దాడికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: SFI

హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద SFI తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఢిల్లీలో పోలీసుల దాడులకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టారు. SFI నాయకులు, ఎంపీ జాన్ బ్రిట్టాస్‌పై దాడికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పారదర్శకత పాటించాలని కోరారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

More in Local