← Back to news

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు

By DK· 23 Jul 2026· యాదాద్రిభువనగిరి జిల్లా
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు

TG: BJP ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ నిర్వహించిన రాస్తారోకోలో ఆమె పాల్గొని మాట్లాడారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఫైరయ్యారు.

More in Politics