మాలిసింగారంలో శిథిల పాఠశాల.. ఆరుబయట చదువులు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం మాలిసింగారం గ్రామంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైంది. 40 మంది ఆదివాసి విద్యార్థులు పక్కనే ఉన్న అంగన్వాడి వరండాలో ఆరుబయట చదువులు కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు అనేకసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్త పాఠశాల భవనం మంజూరు చేయాలని ఆదివాసి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.





