ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామంలోని ఐటీడీఏ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వారితో కలిసి తిని, నాణ్యతపై హాస్టల్ వార్డెన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులు, పాఠశాల పరిసరాల్లో తిరిగి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన వసతులు కల్పించాలని హెడ్‌మాస్టర్‌ను ఆదేశించారు.





