చనిపోయిన Studentకి న్యాయం జరగాలి

TG : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జూకల్ హాస్టల్‌లో 5వ తరగతి విద్యార్థి చనిపోవడంపై విచారణ జరిపించాలని BSP నేత అనుముల తుకారం డిమాండ్ చేశారు. ఫిట్స్ రావడం వల్లే విద్యార్థి చనిపోయాడని ప్రిన్సిపాల్ చెప్తున్నా, అసలు ఏం జరిగిందో పూర్తిగా బయటకు తీయాలన్నారు. హాస్టల్ ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేసి, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన విద్యార్థికి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు.



