← Back to news

రాష్ట్ర ఆదాయం తెలంగాణకు పోయింది: కొల్లు రవీంద్ర

By డీకే· 16 Jun 2026· Andhrajyothy· అమరావతి
రాష్ట్ర ఆదాయం తెలంగాణకు పోయింది: కొల్లు రవీంద్ర

YCP హయాంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తెలంగాణకు వెళ్లిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎక్సైజ్‌‌శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై మంత్రి మాట్లాడారు. 2014-19లో AP కంటే తెలంగాణ రూ.4186 కోట్లు అదనంగా మద్యం అమ్మితే, 2019-24 మధ్య ఏకంగా రూ.42762 కోట్లు అదనంగా అమ్మిందని తెలిపారు. YCP నాయకులకు చెందిన నాసిరకం బ్రాండ్లు విక్రయించడం, ధరలు 75శాతం పెంచడంతో అమ్మకాలు పడిపోయాయన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ షాపులు ఏర్పాటుచేసి AP ప్రజలకు మద్యం అమ్మారని తెలిపారు. ఐదేళ్లలో రూ.18,860 కోట్ల ఆదాయం పక్క రాష్ట్రానికి వెళ్లిపోయిందన్నారు.

More in Politics