← Back to news

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం మార్పు

By Bala· 2h ago
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం మార్పు

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జేఎంజే కళాశాల నుంచి వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కళాశాలకు మార్పు చేశారు. సోమవారం జేఎంజే కళాశాలను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించి ఇరుకుగా ఉన్నందున మార్పు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు.

More in Local