← Back to news

ఆఫీస్ నుంచి బ్రేక్ తీసుకుంది... అంతలోనే ప్రమాదం

By Vinith· 2d ago· Hyderabad
ఆఫీస్ నుంచి బ్రేక్ తీసుకుంది... అంతలోనే ప్రమాదం

హైదరాబాద్‌లోని అమీర్‌పేట బిగ్‌బజార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమదుర్గ అనే యువతి అక్కడికక్కడే చనిపోయింది. భీమవరానికి చెందిన ఈమె బంజారాహిల్స్‌లోని ఓ కార్ల షోరూమ్‌లో వర్క్ చేస్తోంది. ఫోన్ రిపేర్ కోసం ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని, ర్యాపిడో బైక్‌పై అమీర్‌పేట వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమె స్పాట్‌లోనే చనిపోగా, బైక్ నడిపిన వ్యక్తికి గాయాలయ్యాయి.

More in Local