← Back to news

పబ్లిక్ గార్డెన్స్ వద్ద ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

By Bala· 4h ago· X· TG

హన్మకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఆర్టీసీ బస్సుపై భారీ చెట్టు కూలింది. ఒక్కసారిగా చెట్టు పడటంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో రెండు బైకులు, మూడు ఆటోలు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరి, పీల్చుకున్నారు. చెట్టు కూలడంతో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

More in AP