← Back to news

సరస్ మేళాకు నారా లోకేష్‌కు ఆహ్వానం

By epuri rajaratnam· 1d ago· Vijayawada Village Portion (Part), Vijayawada West, Ntr
సరస్ మేళాకు నారా లోకేష్‌కు ఆహ్వానం

విజయవాడ పున్నమిఘాట్‌లో ఈ నెల 13 నుంచి 31 వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాకు హాజరుకావాలని మంత్రి నారా లోకేష్‌ను SERP CEO వాకాటి కరుణ, MEPM ఎండీ బాలకృష్ణ ఆహ్వానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఆహ్వాన పత్రిక అందజేశారు. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను మేళాలో ప్రదర్శించి విక్రయించనున్నారు. ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేళాను ప్రారంభించనున్నారు.

సరస్ మేళాకు నారా లోకేష్‌కు ఆహ్వానం

More in Local