ఆరు నెలలుగా ఎదురుచూపులు!

TG: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుభీమా సాయం కోసం బాధిత కుటుంబాలు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటివరకు ఒక్కరికీ భీమా అందలేదని సమాచారం. ప్రీమియం చెల్లింపులో జాప్యమే కారణమని తెలుస్తోంది. కొందరి ధ్రువపత్రాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. మరికొన్ని దరఖాస్తులు నోడల్ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులకూ స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.



