మెగా డేటా సెంటర్స్ ఎవరి కోసం? పౌర సభలో చర్చ.!

విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్లు, బీచ్ శాక్స్ ఏర్పాటు అవసరం, వాటి పరిణామాలపై చర్చించేందుకు పౌర చైతన్య వేదిక - PCV అధ్వర్యంలో పౌర సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సెప్టెంబర్ 16 ఉదయం 10 గంటలకు GVMC ఆఫీస్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ప్రాంగణంలో ఈ సభ జరుగుతుంది. PCV విశాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ కోలవెన్ను చాంద్ అధ్యక్షతన జరిగే ఈ సభకు CPDRS జాతీయ నేత ప్రొఫెసర్ కుంచె శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.


