విజిలెన్స్ DSPగా మురళీకృష్ణ బదిలీ

మంగళగిరి గుంటూరు నార్త్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సీహెచ్ మురళీకృష్ణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DSPగా బదిలీ అయ్యారు. రెండేళ్ల రెండు నెలల పాటు విధులు నిర్వహించిన ఆయన.. మంగళగిరిలో VVIP బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, నిరసన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించామని తెలిపారు. పలు కీలక కేసుల ఛేదనలో సిబ్బంది సహకారం కీలకమన్నారు. తనకు సహకరించిన అధికారులు, సిబ్బంది, మీడియా, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.


