డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే ఇంత దారుణమా?: రాహుల్

పంజాబ్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలు, సామాన్యులపై దాడులు పెరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భగవంత్ మాన్ నేతృత్వంలోని AAP పాలనలో పంజాబ్‌లో డ్రగ్స్‌పై గళం విప్పడం ప్రాణాల మీదకు తెచ్చే శిక్షలా మారిందని ఆయన మండిపడ్డారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పర్విందర్ సింగ్ ఝొట్టాను నడిరోడ్డుపై పగటిపూటే కాల్చి చంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.



