← Back to news

మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు

By DK· 26 Jul 2026· వరంగల్ జిల్లా
మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు

TG: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA, BRS సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ICUలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో BRS శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, KTR హుటాహుటిన హన్మకొండకు బయలుదేరారు.

More in Politics