కుంభమేళా గర్ల్ మోనాలిసాకు ప్రాణభయం..

'కుంభమేళా గర్ల్' మోనాలిసా, ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్‌కు ప్రొటెక్షన్ ఇవ్వాలని కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆన్‌లైన్ లవ్‌తో వీరిద్దరూ కేరళలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా, మోనాలిసా మైనర్ అంటూ ఆమె తండ్రి మధ్యప్రదేశ్‌లో కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో భర్త అరెస్ట్‌పై కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది. మతాంతర వివాహం వల్ల తమ ఫ్యామిలీస్ నుండి ప్రాణాలకు ముప్పు ఉందని ఈ కపుల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, జులై 10న జరిగే నెక్స్ట్ హియరింగ్ వరకు వీరికి సేఫ్టీ కల్పించాలని కోర్టు ఆర్డర్ వేసింది.



