నోయిడా కార్మికులకు మద్దతుగా హైదరాబాద్‌లో నిరసన

TG: జీతాల పెంపు, ఇతర సౌకర్యాల కోసం నోయిడా కార్మికులు చేస్తున్న పోరాటానికి విద్యార్థులు, సోషల్ యాక్టివిస్టులు మద్దతుగా నిలిచారు. కార్మికులను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగరంలో నిరసన తెలిపారు. సుందరయ్య పార్క్ సమీపంలో CaRWAN నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిశ విద్యార్థి సంఘం పాల్గొంది. అరెస్ట్ చేసినవారిలో కొందరిని ఐదు నెలలుగా జైలులో ఉంచారని నిరసనకారులు తెలిపారు. జైలులో ఉన్న కార్మికులు, విద్యార్థులు, సోషల్ యాక్టివిస్టులను వెంటనే విడుదల చేయాలని కోరారు.



