నవరాత్రికి గర్బా డ్రెస్సే కాదు.. ఇప్పుడు ఇదీ ట్రెండింగ్

నవరాత్రి ఫెస్టివల్ కోసం గర్బా, దాండియా డ్రెసెస్ మాత్రమే కాదు, నేయిల్ ఆర్ట్ కూడా కొత్తగా ట్రెండ్ అవుతోంది. తొమ్మిది రోజు కోసం బంధానీ ప్రింట్స్, అద్దాల పనితనం, వారులీ ఆర్ట్, త్రిశూలం, స్వస్తిక్ డిజైన్స్ నేయిల్స్ పై వేయించుకోవడానికి జెన్-జీ బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. రెడ్, రాణి పింక్ తో పాటు న్యూడ్ కలర్స్, గోల్డ్, సిల్వర్ ఉన్న పాపులర్ న్యూడ్ షేడ్స్ ఎంచుకుంటున్నారు. ప్రతిరోజూ అవుట్ఫిట్కి మ్యాచ్ చేసుకోవడానికి ప్రెస్-ఆన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు.




