అమ్మో AI.. కొంపముంచేసేదే.!

తమ AI మోడల్‌ను బయో వెపన్స్ తయారీకి వాడుకోవాలనే ఒక ప్రమాదకరమైన ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఆంత్రోపిక్ ప్రకటించింది. కొందరు తమ AI టెక్నాలజీని వాడి బయో వెపన్స్ సమాచారం తెలుసుకోవడానికి యత్నించారనీ, అయితే తమ సెక్యూరిటీ వ్యవస్థలు వెంటనే ఆ దుర్వినియోగాన్ని గుర్తించి బ్లాక్ చేశాయని సంస్థ తెలిపింది. AI టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ ఇలాంటి ప్రమాదాలు పెరిగే ఛాన్స్ ఉంది. స్ట్రాంగ్ సెక్యూరిటీ చర్యలు అవసరం. AIని సేఫ్‌గా వాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆంత్రోపిక్ తెలిపింది.

