హాస్పిటల్‌కి వస్తే కొత్త రోగాలు గ్యారంటీ?

TG: హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లలో దుర్వాసన వస్తోందని, లోపలికి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ఇలా ఉంటే కొత్త రోగాల బారిన పడతామేమోనని భయంగా ఉందంటున్నారు. టాయిలెట్స్ తలుపులు విరిగిపోయి ఉన్నాయని చెప్తున్నారు. రోగులకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.

