← Back to news

వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం

By BUJJIBABU· 1d ago· Guntur
వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం

మంత్రి నారా లోకేష్ చొరవతో ఇద్దరు నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, మరో వ్యక్తికి జీవనోపాధి కోసం టిఫిన్ బండిని అందించారు. ప్రాతూరు గ్రామానికి చెందిన మేరుగ దిబ్బమ్మకు ₹54,067, కొలనుకొండకు చెందిన దావీదుకు ₹20,524 చొప్పున మంజూరైన చెక్కులను TDP అధ్యక్షుడు అరవపల్లి శ్రీనివాస్ అందజేశారు. తమకు ఆర్థికంగా అండగా నిలిచి, ఉపాధి కల్పించిన మంత్రి నారా లోకేష్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

More in Local