← Back to news

26 ఏళ్లుగా ఒకే అమ్మవారి విగ్రహం

By Mahesh· 1d ago· Nizamabad
26 ఏళ్లుగా ఒకే అమ్మవారి విగ్రహం

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామం నవరాత్రి ఉత్సవాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. గత 26 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా ఊరంతా కలసి ఒకే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఐక్యత చాటుతున్నారు. ఈ ఏడాది 164 మంది భవానీ దీక్షలు తీసుకున్నారు. అన్నదానంలో ప్లాస్టిక్ వాడకుండా ఆకు విస్తరాకులను ఉపయోగిస్తూ ఎకో ఫ్రెండ్లీగా వేడుకలు జరుపుకుంటున్నారు.

More in Local