మా భూములు వేరోళ్లకు ఎందుకిస్తరు?

‘‘30 ఏళ్లుగా ఉంటున్నం. ఇవి మా భూములు. పోలవరంలో మునిగిపోయినోళ్లకు ఇస్తారట. మరిమేం ఏం కావాలె?‘‘ అంటూ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద AIKMS ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బుట్టాయిగూడెం మండలం వెలుతురువారిగూడెం గిరిజనులు 30 ఏళ్లు గా సాగు చేస్తున్న భూములను పోలవరం నిర్వాసితుల R & R ప్యాకేజీ కోసం సేకరించడాన్ని నిలిపి వేయాలన్నది వారి డిమాండ్. భూములపై వివాదాస్పద తీర్పులు, కేసులు పెండింగ్‌లో ఉన్నందున సర్వే, భూసేకరణ, అవార్డు విచారణ నిలిపివేసి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.



