← Back to news

నెల రోజుల పోరాటానికి ఫలితం

By NANI· 24 Aug 2026· Kakinada
నెల రోజుల పోరాటానికి ఫలితం

AP : కాకినాడ జిల్లా శంఖవరం SC హాస్టల్‌ను మూసేయడాన్ని వ్యతిరేకిస్తూ దళిత, విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలసి వినతిపత్రం ఇచ్చారు. నాయకుల ఆవేదన విన్న కలెక్టర్ పిల్లల మంచికోసమే పాత హాస్టల్‌ను తాత్కాలికంగా మూసేశామని చెప్పారు. ఈ నెలాఖరులోగా బడి దగ్గరలోనే కొత్త హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. పాత హాస్టల్ భవనాన్ని SC, ST విద్యార్థులు కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా మారుస్తామన్నారు. నెల రోజులుగా చేస్తున్న పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కడంతో నాయకులు ఆనందపడ్డారు.

నెల రోజుల పోరాటానికి ఫలితం

More in Local