సెప్టెంబర్ 17న సమరయోధులను స్మరించుకోవాలి

TG: మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద ఎంపీ డీకే అరుణ నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 1947 అక్టోబర్ 7న బెల్లం నాగన్న నాయకత్వంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అప్పంపల్లిలో 11 మంది అమరులయ్యారని, పలువురు గాయపడ్డారని గుర్తుచేశారు. సెప్టెంబర్ 17న సమరయోధులను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. విమోచన దినోత్సవాన్ని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు.


