ఏకమైలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏకమై గ్రామంలో బతుకమ్మ సంబరాలు నిన్న ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తంగేడు, గునుగు, చామంతి తదితర రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు. సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. మహిళల ఆటపాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

