హైదరాబాద్ ట్రాఫిక్‌కు బిగ్ రిలీఫ్.. కొత్త ఫ్లైఓవర్ ఓపెన్!

TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మరో కీలక ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. నల్గొండ 'X' రోడ్స్ నుంచి సైదాబాద్, IS సదన్ మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు 3.23 కి.మీ <a href="https://x.com/HiHyderabad/status/2095230414982168691">కారిడార్‌ను</a> CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.620 కోట్ల ఖర్చుతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ 4-లేన్ ఫ్లైఓవర్‌తో రూట్‌లో ట్రాఫిక్ జామ్‌లు తగ్గి జర్నీ టైమ్ కూడా సేవ్ కానుంది. ప్రయాణికులకు ఈ కారిడార్ బిగ్ రిలీఫ్ ఇవ్వనుంది. దీంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.



