పత్తి చేనులో విషాదం.. వ్యవసాయ కూలి మృతి

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పత్తి ఏరేందుకు వెళ్లిన వ్యవసాయ కూలి పోలుదాసరి రాజేశ్వరి ఎండ తీవ్రతకు తాళలేక స్పృహ కోల్పోయి కుప్పకూలింది. కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజేశ్వరి కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


