'పీఠికాపుర వనం'.. ప్రారంభించిన DCM పవన్ కళ్యాణ్

AP: కేంద్ర ప్రభుత్వ 'నగర వన్ యోజన పథకం' కింద పిఠాపురంలో 1కోటి 83లక్షలతో అభివృద్ధి చేసిన పీఠికాపుర వనాన్ని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఇదివరకు డంపింగ్ యార్డుగా ఉన్న ప్రాంతాన్ని 6 ఎకరాల్లో హరిత వనంగా మార్చి, నక్షత్రవనం, శివ పంచాయతన వనం, మియావాకీ ప్లాంటేషన్, బటర్‌ఫ్లై పార్క్ వంటి ఆకర్షణలతో ఆహ్లాదం, ఆధ్యాత్మికత కలయికగా తీర్చిదిద్దారు. రాష్ట్రవ్యాప్తంగా 18 నగర వనాలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ప్రజలకు ఆరోగ్యాన్ని పెంచే లక్ష్యంతో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.





