మైనర్ డ్రైవింగ్‌పై విద్యార్థులకు న్యాయ అవగాహన

మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కాకతీయ విద్యాలయంలో న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. జడ్జిలు దుర్గా ప్రసాద్, ఉషా కిరణ్ పాల్గొన్నారు. న్యాయవాది మచ్చర్ల విజయ్ సామ్రాట్ మైనర్ డ్రైవింగ్, జువినైల్ జస్టిస్ యాక్ట్, రహదారి భద్రత, బాలల హక్కులపై వివరించారు. చిన్న వయసులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలు గురించి చెప్పి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.





