హాస్పిటల్‌పై అనుమానాలున్నాయి- సోనమ్ వాంగ్‌చుక్ భార్య

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ రిపోర్ట్స్ ప్రకారం సోనమ్ వాంగ్‌చుక్ పొటాషియం లెవెల్ నిన్న 4.3 ఉంటే, ఈరోజు ఒక్కసారిగా 2.9కి పడిపోయిందని ఆయన భార్య గీతాంజలి ఆందోళన వ్యక్తం చేశారు. వేరే ల్యాబ్‌లో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి హాస్పిటల్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదని, బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. హాస్పిటల్ ప్రవర్తనపై అనుమానాలు ఉన్నాయని, వెంటనే డిశ్చార్జ్ చేయాలని కోరినా రెండు గంటలుగా స్పందన లేదని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.



