కొత్తగూడెంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ జనసేన పార్టీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. GSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. జనసేన వీరమహిళలు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం, ఐక్యతకు ప్రతీక అని, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు కీలకమని తెలిపారు.



