నూతన మార్కెట్‌ను పరిశీలించిన అధికారులు

TG: జనగామ జిల్లా సంజయ్‌నగర్‌లోని నూతన మార్కెట్‌లో మౌలిక సదుపాయాలను మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. మార్కెట్‌లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సదుపాయాలను తనిఖీ చేశారు. కూరగాయలు, పండ్లు, పూలు, వెజ్, నాన్‌వెజ్ వ్యాపారులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించినట్లు తెలిపారు. వ్యాపారులంతా నూతన మార్కెట్‌కు తరలివచ్చి సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ అధికారులు కోరారు.


