స్టూడెంట్స్ ప్రొటెస్ట్ వయలెంట్.. ఎగ్జామ్స్ వాయిదా!
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ చేసిన నిరసన హింసాత్మకంగా మారడంతో క్యాంపస్‌లో టెన్షన్ సిట్యుయేషన్ క్రియేట్ అయింది. దీంతో అలర్ట్ అయిన మేనేజ్‌మెంట్ సెప్టెంబర్ 28 నుండి 10 రోజుల పాటు రెగ్యులర్ క్లాసెస్ సస్పెండ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అలాగే జరగాల్సిన మిడ్‌టర్మ్ ఎగ్జామ్స్‌ను కూడా వాయిదా వేసింది. స్టూడెంట్స్ సేఫ్టీ కోసం ఇళ్లకు వెళ్లొచ్చని, హాస్టల్స్‌లో ఉండేవాళ్లు బయట అనవసరంగా తిరగొద్దని యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ సూచించారు.



