మజీద్‌కు పొజిషన్ సర్టిఫికెట్.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు

పలమనేర్ లోని గంగవరం మండల మైనారిటీ సోదరులు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. డ్రైవర్స్ కాలనీలో ఏర్పాటు చేసుకున్న మహమ్మదీయ మజీద్‌కు పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించినందుకు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖాజాపీర్, ముతవల్లి జమాల్ బాషా, పటేల్ ఎండి.మొహమ్మద్, సర్కార్ భాషా, అమర్, చాంద్ భాషా సిరాజ్, గుడుసాబ్ తదితరులు పాల్గొన్నారు.



