రియాద్ దాడిలో హైదరాబాద్ వాసి మృతి.. స్పందించిన ఒవైసీ

TG: సౌదీ అరేబియాలోని రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిన్న జరిగిన దాడిలో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ యూసుఫ్ అలీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు గాయపడ్డారు. మెహదీపట్నానికి చెందిన యూసుఫ్ కుటుంబంతో కలిసి ఉమ్రా యాత్ర కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై MP అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ఈ ఘటన గురించి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది.


