← Back to news

కరెంటు కష్టాలు.. పెరుగుతున్న అవసరాలు!

By A.Ajay· 2h ago
కరెంటు కష్టాలు.. పెరుగుతున్న అవసరాలు!

TG: రోజుకు 315–330 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. అవసరాలు పెరుగుతుండగా, బొగ్గు నిల్వలు తగ్గడం, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో బయట నుంచి కరెంటు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు సౌర, పవన విద్యుత్‌తో పాటు బ్యాటరీల్లో విద్యుత్ నిల్వ చేసే ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తు అవసరాల కోసం 7,800 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

More in TG